ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు అగమౌతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. ప్రధానంగా వర్షాధార పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే.. కేసీఆర్ సర్కర్ దళితులకు ఎన్ని ఇల్లు కట్టారు.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్ళో మేము ఓట్లు అడుతామన్నారు.
బెంగాల్లో 5న జరగబోయే ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం కలిసి అధికార టీఎంసీపై దాడిని పెంచాయి. ఇండియా కూటమిలో ఒకవైపు మూడు పార్టీలు కలిసి ఉంటూనే.. ఉప ఎన్నిక రాగానే ప్రచారంలో అధికార టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధికార భారతీయ జనతా పార్టీ( బీజేపీ) నుంచి వలసలు మొదలయ్యాయి. రెండు రోజుల్లోనే ఇద్దరు సీనియర్ నేతలు పార్టీని వీడారు.
Ponguleti-Tummala: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహిళను ఆమె భర్త నగ్నంగా చేసి బహిరంగం ఊరేగించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చైనా సంస్థల ప్రతినిధిగా మారారా అని రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.