Sanatana Dharma: చెన్నైలో సెప్టెంబర్ 2న జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై చేసిన ప్రకటనపై గురువారం ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను ఏ మతానికి శత్రువు కాదని అన్నారు. అసలు ఆయన ఏమన్నారంటే..’ డెంగ్యూ, మలేరియా ఎలాగో సనాతన ధర్మం కూడా అంతే.. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు.. దాన్ని నిర్మూలించాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనపై ఢిల్లీ, యూపీలో ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ- అన్ని కేసులకు న్యాయపరంగా సమాధానం ఇస్తానన్నారు.
మోడీ ప్రభుత్వంపై దాడి చేస్తూ ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబర్ 7న ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. స్టాలిన్ మాట్లాడుతూ- మోడీ అండ్ కంపెనీ దృష్టి మళ్లించడానికి సనాతన ధర్మం ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోని మణిపూర్లో తలెత్తిన ప్రశ్నలను ఎదుర్కోవడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారు. తన స్నేహితుడు అదానీతో కలిసి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నారు. ప్రజల అజ్ఞానమే వీరి నాటకీయ రాజకీయాలకు మూలధనం అన్నది నిజం. గత 9 సంవత్సరాలుగా బిజెపి వాగ్దానాలన్నీ బూటకపు వాగ్దానాలు. ప్రజా సంక్షేమం కోసం నిజంగా ఏమి చేశారు అనేది ప్రస్తుతం దేశం మొత్తం ఐక్యంగా నిరాయుధ, ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తుతున్న ప్రశ్న. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు వార్తల ఆధారంగా నాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యకరమైన విషయమని ఉదయనిధి అన్నారు.
Read Also:Mitchell Starc: మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత..!
ఆ ట్విట్టర్లో ఆయన ఇంకా తాను కూడా ఆధ్యాత్మికవేత్తనే అని చెప్పుకొచ్చారు. ఏ మతమైనా కులాల పేరుతో ప్రజలను విభజిస్తే.. ఆ మతంలో అంటరానితనం, బానిసత్వం కనిపిస్తే ఆ మతాన్ని వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. ఉదయనిధి తన ప్రకటనను సమర్థించడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 6న కూడా ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఉదయనిధి – తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, కుల వివక్ష వంటి సనాతన ఆచారాలకు వ్యతిరేకమని అన్నారు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడమే ఇందుకు తాజా ఉదాహరణగా పేర్కొన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో జరిగిన జన్మాష్టమి కార్యక్రమంలో ఉదయనిధి ప్రకటనను సమర్థించిన వారిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఎదురుదాడికి దిగారు. శ్రీకృష్ణుడి స్తోత్రాలు సనాతన ధర్మాన్ని సవాలు చేసే వారికి చేరుకునేలా గొప్పగా ఉండాలని స్మృతి అన్నారు. భక్తులు జీవించి ఉన్నంత కాలం మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఎవరూ సవాలు చేయలేరన్నారు. అంతకుముందు బుధవారం కేబినెట్ మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సనాతన ధర్మంపై చర్చకు మంత్రులు తగిన సమాధానం చెప్పాలని ప్రధాని చెప్పినట్లు సమాచారం.
Read Also:Allahabad High Court: బైబిల్‌ని పంచిపెట్టడం మతమార్పిడి కిందకు రాదు..
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై ఎఫ్ఐఆర్
తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన్ ప్రకటనను తప్పుగా చూపించినందుకు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo
— Amit Malviya (@amitmalviya) September 2, 2023
ఉదయనిధి ప్రకటనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు, కోర్టులో పిటిషన్
సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటూ ఉదయనిధి చేసిన ప్రకటనపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుధీర్ కుమార్ ఓజా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ఇది సెప్టెంబర్ 14న విచారణకు రానుంది. అంతకుముందు ఉదయనిధిపై ఢిల్లీ పోలీస్‌లో ఒక న్యాయవాది ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యూపీలోని రాంపూర్‌లో స్టాలిన్‌పై న్యాయవాదులు కేసు నమోదు చేయగా.. బుధవారం కర్ణాటక బీజేపీ నేత నాగరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:UPI Payments: యూపీఐ పేమెంట్స్ మరింత సులవు.. చెబితే చాలు..
ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా 262 మంది ప్రముఖులు సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాలని ఈ వ్యక్తులు డిమాండ్ చేశారు. వీరిలో 14 మంది న్యాయమూర్తులు, 130 మంది బ్యూరోక్రాట్లు, 118 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు. స్టాలిన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని తమిళనాడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.