Madhya Pradesh: మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ అనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 19వ శతాబ్దపు సామాజిక సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్‌ను ‘‘బ్రిటిష్ ఏజెంట్’’గా పిలిచారు. అగర్ మాల్వాలో జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి బ్రిటిష్ వారి తరుపున పనిచేసినట్లు ఆరోపించారు.
సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..! మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని…
ఒక్క ఫలితం… వంద సంకేతాలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఇది నిజంగా బూస్ట్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏయే కోణాల్లో ఈ ఫలితం ప్లస్ అవుతోంది? పార్టీ మీద, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకు సీఎం చేతిలో ఎలాంటి అస్త్రం అవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ పరపతికి, ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనమన్న అభిప్రాయం బలంగా ఉంది.…
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని…
Minister Seethakka : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్…
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
Jubilee Hills by-election: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్.. అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్.. పోస్ట్ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్లోనూ…
Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఏకంగా 185 నుంచి 190 స్థానాలు సాధించే దిశగా ఎన్డీయే వెళ్తోంది. ఇక ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈసారి కూడా ఆర్జేడీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.