Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. అయితే, ఈ హామీని అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీఓ (GO)పై ప్రస్తుతం హైకోర్టులో…
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది.
Karnataka Congress Crisis: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది.
సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ,…
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం…
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్‌కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది.