PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు……
TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “ఇది చాలా కీలకమైన సమయం. ఈ వారం రోజులు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే రోజులు. ప్రతి నాయకుడు తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా…
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు.
CM Revanth Reddy : నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేదని, SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు.. కమిషన్…
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య రుసరుసలాడారు.
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ…
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు..