కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గంటల తరబడి మాట్లాడేసుకున్నారు కూడా. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? చర్చకు వచ్చిన అంశాలేంటి? పార్టీలో చాలా ఘర్షణల తర్వాత కలిసిన ఇద్దరు నాయకులు.. మనసులో మాట బయట పెట్టేసుకున్నారా? పార్టీ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారు?తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక సంచలనం. రెండున్నర గంటలకుపైగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటనే ఆసక్తి పెరుగుతోంది.…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్‌ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ…
తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని,…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…