Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని…
CM Revanth Reddy : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
Jagruthi Foundation Day 2025: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ఉట్టి దర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం అని, కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత…
Congress : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొననున్నారు. Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి…
Meenakshi Natarajan : నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్‌షీట్‌లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ…
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి.
BJP vs Congres : తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్…
Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్‌లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి…