కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప.. మిగిలిన అన్ని ట్రక్కులు రోడ్లపైకి రావని రవాణా సంఘాలు తెలిపాయి.
Kotha Prabhakar Reddy: సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన బహిరంగ సుమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాక, అవసరమైతే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామని…
CM Revanth Reddy : తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని…
Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ…
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పిస్తూ.. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా విధ్వంసం చేస్తున్నారు.. ప్రజల దృష్టి మరల్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు..hcu భూముల విషయంలో అతి పెద్ద కుట్ర జరిగింది.. దీని వెనకాల 10 వేల ఎకరాల స్కాంకు తెరలేపారు.. రేవంత్ ప్రభుత్వం ఆర్ధిక నేరానికి పాల్పడుతోంది.. ఇది…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
KTR : ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ హామీల మీద హామీలు గుప్పిస్తుంది. అధికారంలోకి వస్తే తాము ఇది చేస్తాం అది చేస్తామంటూ చెబుతోంది. ఇలా హామీలు ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా లేదా క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసమే ఈ హామీలు ఇస్తున్నారా…? పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జనాల…
Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి…
Jagadish Reddy : నల్లగొండ జిల్లా రాజకీయ వేడిని మరోసారి పెంచుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వ్యవసాయ రంగం దుర్దశను ఎదుర్కొంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పంటలకు బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ అంశం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రులు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కేవలం కమిషన్లకే పరిమితమయ్యారని, దళారులకు…
Palla Rajeshwar Reddy : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిచేసి, ఫేజ్ 3లో మూడు మోటర్లతో 1800 క్యూసెక్కుల నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం” అని తెలిపారు. అయితే,…