అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు.