తెలంగాణ మంత్రి కె. తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సుమారు 150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది కెమ్ వేద లైఫ్ సైన్సెస్. హైద్రాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం…
దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు. దేశం ఆర్థిక రంగంలో…
అమెరికా తరువాత ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నది. ఇక, అమెరికాను అన్ని విధాల అడ్డుకునేందుకు కూడా చైనా ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని పసిగట్టిన అమెరికా కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. చైనా నుంచి అమెరికా స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్టింగ్ అయిన కంపెనీలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం చైనా కంపెనీలు వారి ఆడిట్ రిపోర్టులలో కొంత…
కరోనా సమయంలో అనేక కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. కరోనా మొదటి, సెకండ్ వేవ్ తరువాత నెమ్మదిగా ప్రపంచం కోలుకుంటోంది. కరోనా నుంచి బయటపడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కొన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. 2022 జనవరి వరకు అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ పక్కన పెట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు……
ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా…
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ఐటీ పాలసీలపై సమీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్‌సెంటీవ్‌లను ఇవ్వాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఒక ఉద్యోగి ఏడాదిపాటు అదే కంపెనీలో పనిచేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతి, విశాఖ, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా, అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. Read: బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!…
చైనా దేశంపై అమెరికా మరోమారు ఉక్కుపాదం మోపింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడానికి చైనా వైరస్ కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించడంతోపాటు, 31 చైనా కంపెనీలపై నిషేదం విధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత, చైనాతో సత్సంబందాలు కొనసాగుతాయని అనుకున్నారు. అ దిశగానే బైడెన్ అడుగులు వేసినా, తాజా పరిణామాలతో మరోసారి చైనాపై బైడెన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. చైనాకు చెందిన 28 కంపెనీలపై నిషేదం విధించింది.…