పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి.
Praja Sangrama Yatra: ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పాద యాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ సమస్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ సాగుతున్నారుజ ఈనేపథ్యంలో.. కేసీఆర్ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడి పోతావ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేస్తుందని ఆరోపించారు. దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల…
తెలంగాణ ద్రోహులు అంతా కేసీఆర్ పక్కన ఉన్నారని ఎద్దేవా చేశారు. 24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జడ్చర్లలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1500 కోట్ల విలువైన 120 ఎకరాలను కబ్జా చేసిన ఘనులు టీఆర్ఎస్ నేతలేనని అన్నారు. టీఆర్ఎస్ నేతలు జనాన్ని దోచుకుంటున్నరని అన్నారు. చివరకు పేదల, ఆరె కటికెల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం…
బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై…