Xi Jinping: చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ అధినేత షి జిన్‌పింగ్, పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తిగత చిత్తశుద్ధిని కాపాడుకోవాలని, బంధువులను అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సిపిసి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) సెంట్రల్ కమిటీ యొక్క పొలిటికల్ బ్యూరో సభ్యులు మార్క్సిస్ట్ మేధావుల ప్రమాణాలను పాటించాలని, మొత్తం పార్టీ వ్యక్తిగత సమగ్రతకు, క్షమశిక్షణకు ఉదాహరణగా నిలుస్తారని అన్నారు. డిసెంబర్ 22న కీలక పార్టీ సమావేశంలో…
Tiananmen Square: స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణిచివేసి, వేల మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన తియాన్మెన్ స్వేర్ ఊచకోతకు 34 ఏళ్లు నిండాయి. తమకు ఎదురుతిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందనే ఉదంతాన్ని తియాన్మెన్ స్వేర్ రూపంలో చైనా చూపించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది, యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది.
Xi Jinping re-elected as General Secretary of Communist Party of China for record third term:చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మూడోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికై రికార్డ్ క్రియేట్ చేశారు. మరో ఐదేళ్ల పాటు పార్టీ అధినేతగా ఉండనున్నాదు. దీంతో ఆయనకు మూడోసారి చైనా అద్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. గతం చైనా శక్తివంతమైన నాయకుడిగా పేరుపొందిన మావో జెడాంగ్ మాత్రమే గతంలో పార్టీకి రెండు పర్యాయాలు…
China Enshrines Opposition To Taiwan Independence Into Its Constitution: చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో పలు కీలక తీర్మాణాలు చేస్తోంది ఆ పార్టీ. దీంట్లో భాగంగానే తైవాన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తన రాజ్యాంగంలో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిబంధనలను తీసుకువచ్చింది. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో తీర్మాణం చేసింది.
China's Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.…
Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష…
Xi Jinping makes first public appearance since SCO meet: చైనాలో సైనిక కుట్ర జరుగుతుందని.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సదస్సు తర్వాత చైనాకు తిరిగి వచ్చిన అధ్యక్షుడు జి జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారని ప్రపంచ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులకు వరసగా ఉరిశిక్షలు విధించడంతో పాటు.. మూడోసారి అధ్యక్షుడు కావాలని భావిస్తున్న జిన్ పింగ్ వైఖరిపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలోని…
Death penalty for former ministers in China: అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు…
చైనాకు జీవిత కాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమిం చేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభమ య్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు…
చైనా కమ్యూనిస్టుపార్టీ శతవార్షికోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాన్ని ఒక పార్టీ వందేళ్లపాటు నడిపించడం, సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తర్వాత కూడా సోషలిస్టు విధానం తమదంటూ కమ్యూనిస్టుల నాయకత్వంలో అమెరికాకు దీటుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థితిలో వుండటం చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకత. ఆసియాలో అత్యంత ప్రాచీన చరిత్ర, నాగరికతగల దేశం చైనా. అసమర్ధ చక్రవర్తుల పాలనలో విదేశీ శక్తులు తిష్టవేశాయి. అది స్థానిక యుద్ధ ప్రభావాల ఘర్షణలకు రంగస్థలమైంది.…