సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారికి ఆమె సమయం ఇచ్చారు. వారి నుండి పురందేశ్వరికి అద్భుతమైన స్వాగతం లభించింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్‌పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు.