కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రంలోని పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయడానికి ఆయా యూనివర్సిటీలు అంగీకరించాయి. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో యూనివర్సిటీల వీసీల సమావేశం జరిగింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి కొత్త పద్ధతులు అనుసరించాలని ఇప్పటికే యూజీసీ అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించిన రాష్ట్రంలోని వర్సిటీల అధికారులు..…
తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే…
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో…
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను విడుదల చేశారు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఇవాళ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్‌లను నియమించారు.. ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆగస్టు 19-25 తేదీల్లో నిర్వహించనుండగా.. ప్రొ. రామలింగరాజు ఛైర్మన్‌గా.. ప్రొ. రవీంద్ర కన్వీనర్ ఉంటారు.. ఈసెట్‌ను సెప్టెంబర్ 19న అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ జి. రంగనాథం ఛైర్మన్‌గా,…