Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే…