ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని.. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్నడుస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ‘’వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..’’ అంటూ అమిత్‌షాను ఉద్దేశించి సైటైర్ వేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అంటే…
తెలంగాణలో వడ్ల రాజకీయం రోజుకో మలుపు తిరిగింది. చివరాఖరికి తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనడానికి రెడీ అయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జోగులాంబ తల్లి ఏమి తప్పు చేసింది… ఇక్కడ దసరా ఉత్సవాలు అధికారికంగా ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు అమ్మ వారు అంటే భయం లేదు.. మైనార్టీ లు అంటే భయం.…
తెలంగాణలో ప్రభుత్వానికి-రాజ్ భవన్ కి మధ్య అగాథం పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. వరుస పర్యటనల్లో ఆమెకు అవమానంగా జరుగుతోందని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. స్రోటోకాల్ సమస్య పై చెప్పాల్సిన చోట చెప్పానన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ పట్ల అధికారులు అనుసరిస్తున్న ప్రోటోకాల్ సమస్యపై చెప్పాల్సిన చోటే తాను చెప్పానని ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఏమీ లేదని గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు…
ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంకి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేసాం అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసాం అని ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం కి పరిపాలనా యోగ్యత లేదు. ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా పార్టీలు ఏకం కావాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్‌ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని…
సీపీఐ రామకృష్ణ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాలక వర్గం దోపిడికి కారణం కమ్యూనిస్టులు కలిసి పని చేయకపోవడమే అని అన్నారు. కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే పాలక వర్గం దోపిడిని అరికట్టవచ్చని, ఈ విషయంలో సీపీఐకి స్పష్టమైన వైఖరి ఉందని, కలిసి పనిచేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక, ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వెళ్తె విద్యార్ధులను అరెస్ట్…