ఈ భూమిపై ఎన్నో ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. డైనోసార్ల నుంచి మొదలుపెడితే ప్రపంచంలో డేంజరస్ ఎనిమల్స్ చాలా ఉన్నాయి. భూమిపై డైనోసార్ లు ఇప్పుడు లేవు. అవి మిలియన్ల సంవత్సరాల క్రితం చనిపోయాయి. అయితే భూమి మీద ఉన్న ప్రమాదకర జంతువులలో మొసలి ఒకటి. అందుకే వాటిని ‘నీటి రాక్షసుడు’ అని పిలుస్తారు. ఈ జంతువులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది తమ జాతినే చంపి తింటాయి. కొన్నిసార్లు తమ పిల్లలను కూడా తింటాయి. అయితే ప్రస్తుతం మొసళ్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wife Attacked Boss: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
ఈ వీడియోలో ఓ మొసలి మరో మొసలిపై దాడి చేస్తుంది. అంతలోనే దాడి చేసిన మొసలిపై మరో మొసలి మెడపై కొరుకుతుంది. చెరువులోకి వెళ్లేందుకు పెద్ద మొసలి ప్రయత్నిస్తుండగా, మరో మొసలి దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. ఓ మొసలి తోకను పట్టుకున్న వెంటనే, మరో మొసలి మెడను పట్టుకుంటుంది. ఇలా మొసళ్ల మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత రెండు దొర్లుతూ చెరువులో పడిపోతాయి. అయితే ఈ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారో తెలియలేదు. ఈ వీడియో @TheBrutalNature అనే IDతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 35 వేలకు పైగా చూడగా.. వందలాది మంది లైక్ చేసి కామెంట్స్ చేశారు.
— The Brutal Side Of Nature (@TheBrutalNature) July 21, 2023