తమిళనాడులో మరో మాజీ మంత్రిపై అవినీతి నిరోధకశాఖ దాడులు చేస్తోంది.. తమిళనాడు మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటిపై డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దింగిల్ సహా మొత్తం 54 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే కొన్ని కీలమైన డాక్యుమెంట్లు , కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు.. అన్నా డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా…
కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో…
కరోనా పేరు చెబితేనే అంతా ఉలిక్కిపడుతున్నారు.. కరోనా సోకిందంటే నా అనేవాళ్లు కూడా మళ్లిచూసే పరిస్థితి లేకుండా పోయింది.. ఈ మహమ్మారిని తిట్టుకోని దేశం ఈ ప్రపంచంలో లేకుండొచ్చు.. అయితే, దీనిని క్యాష్ చేసుకునేవాళ్లు సైతం లేకపోలేదు.. ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి పిండుకునే పనిలోపడిపోయాయి. మరోవైపు.. అంతా దెయ్యంగా చూస్తున్న కరోనా వైరస్‌ను దేవతగా భావించేవారు కూడా లేకపోలేదు.. తమిళనాడులో ఏకంగా 48 అడుగుల కరోనా వైరస్ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు.. కోయంబత్తూరులోని కామత్చిపురిలోని…
తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 25 రోజుల వ్యవధిలో తమిళనాడులో 25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు చెన్నై మహానగరంలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె కోయంబత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆ జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కోవి నగరంలోనూ కేసులు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోయంబత్తూరు జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉండే…