ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది.
రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తనన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూ దోపిడీ జరిగిందన్నారు. దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీకి…
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఏపీలో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.