సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. "పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు.
తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక జరుగుతున్నది ఏంటని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. "మీ పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు.
ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్‌గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. గత సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను మార్చింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.