ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.
అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు , అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయపార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, అధికార వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ అయ్యారు.