నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది.
ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.