వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. ఈ రోజు పి.గన్నవరంకు చెందిన జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నియోజక ఇంచార్జ్ పోతిన మహేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వారితో పాటు పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. అందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు.