Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రచారంలో దూకుడు పెంచారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొదట సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన ఆయన.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.. అయితే, ఉగాది సందర్భంగా మంగళవారం రోజు ఒక్కరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. ఈ రోజు 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించనున్నారు.. ఈ రోజు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని సీఎం జగన్ మధ్యా్హ్న భోజన విరామం తీసుకోనున్నారు.
Read Also: TS TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు..
ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా ఈ రోజు మధ్యాహ్నం 3. 30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కాగా, ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇచ్చాపురం వరకు కొనసాగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన విషయం విదితమే.