సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది. తనకు అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు.