చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారని.. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదని.. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు, కుతంత్రాలు అని విమర్శించారు. అందుకే నా అనేవాళ్ళు కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు.
ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.