CM YS Jagan: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను జరుపుకుంటున్నారు ప్రజలు.. ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు వచ్చింది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
Read Also: Israel: ఇజ్రాయెల్ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు
మరోవైపు, క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ రోజు తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇక, ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరించనున్నారు.. అంతేకాకుండా.. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేయనున్నారు అధికారులు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024