ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదం కొనసాగుతోంది… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి… వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి… విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సామాజిక డాక్టర్… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి.. కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంటే మేం ఎన్టీఆర్‌కు అవమానంగానే భావిస్తున్నాం…
గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… హౌసింగ్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న ఆయన… ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం… ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేసిన…
ఆంధప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారింది.. 365 రోజులు ఓడీ తీసుకుంటున్నారు… ఏపీ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నారు.. ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రం ఏపీ.. సలహాదారులు మాత్రం చాలా మంది ఉన్నారు.. అబద్దాలు చెప్పడంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఓ అవార్డు ఇవ్వొచ్చు అంటూ సెటైర్లు వేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.. ప్రపంచంలోనే…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది… దాదాపు 20 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిస్తూ.. భారీ ఎత్తున కొత్త పోస్టులకు క్రియేట్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం… కొత్తగా భారీ స్థాయిలో ఎంఈవో పోస్టులను క్రియేట్ చేసింది ఏపీ ఏపీ సర్కార్… ఎంఈవో-2 పేరుతో కొత్త పోస్టులు సృష్టించారు… దీని ప్రకారం.. ఇకపై ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఈవోలు ఉండనున్నారు… కొత్తగా 679 ఎంఈవో-2 పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు పని ఐపోయింది.. అమరావతి విషయంలో భూ భాగోతం బయట పడిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి...
తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధైర్యంగా రాజీనామాలు చేశారు.. టీడీపీకి దమ్ముంటే మీ వాళ్లంతా రాజీనామా చేయండి.. ఎన్నికలకు వెళ్దాం అంటూ సవాల్ విసిరారు మంత్రి మేరుగు నాగార్జున...
రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వాడీవేడీగా సాగిన సమావేశాలు.. మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీలో కాకరేపింది.. ఇక, రెండో రోజు కూడా రసవత్తరమైన చర్చ జరగనుంది.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
బీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు..