500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.
Yogi Adityanath: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
PM Modi WhatsApp Channel: ఛానల్స్ ఫీచర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు వాట్సాప్‌కు వచ్చారు. ఈ ఫీచర్ గత వారం ప్రకటించారు. ఈ ఛానెల్‌లో పీఎం మోడీ ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే తన సందేశాన్ని తన అనుచరులతో పంచుకుంటారు.
Omar Abdullah: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం, ఆ సమావేశాల్లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు పెడతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు సమావేశాలకు పిలుపునిచ్చిన తర్వాతి రోజే కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా
రక్షాబంధన్ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలకు భారీ కానుకను అందించారు.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
Ashwini Choubey : కేంద్ర మంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలన్నారు.