ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పిసిసి కమిటీ, కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది. PCC కమిటీలో పెద్దగా పోటీ దారులు ఉండకపోవచ్చు గానీ.... కేబినెట్ విషయంలో మాత్రం ఆశావాహులు ఎక్కువ. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ, అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది.. ధాన్యం కొనుగోలు…
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి.. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు.. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారు.. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారు.. గత ఆరు నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు.
‘పుతిన్ పిచ్చోడు’.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడిపై ట్రంప్ ఆగ్రహం గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నేను పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు…
ఐపీఎల్: నేడు రెండు మ్యాచ్‌లు. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలు గుజరాత్ vs చెన్నై మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ vs కోల్‌కతా మ్యాచ్. నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల. OUలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు విడదల చేయనున్న ఉన్నత విద్యామండలి. ఈనెల 12న జరిగిన తెలంగాణ ఈసెట్ పరీక్ష. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి.…
కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం.. రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది. మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం,…