కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సీఎం కావటం చారిత్రక అవసరం గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరం అన్నారు. చంద్రబాబుకు గన్నవరం…
Jana Jatara Sabha: నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబుబ్ నగర్ పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్నాంధ్ర సాకార యాత్ర. నేడు నందికొట్కూరు, కర్నూలులో బాలకృష్ణ రోడ్ షో, బహిరంగ సభ. నేడు ఐపీఎల్లో బెంగళూరుతో తలపడనున్న హైదరాబాద్. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్. నేడు సీఎం జగన్ బస్సుయాత్ర యధాతథం. ఉదయం 9గంటలకు కేసపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం. గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్,పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకోనున్న బస్సు యాత్ర.. నేడు శ్రీకాకుళంలోని రాజాం, పలాసలో…
దళితులపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపించారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ను సీఎం అవమానించారని, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయం పై దళిత సంఘాలు స్పందించాలని, భట్టి విక్రమార్క కు కనీస బాధ్యత లేదా..దీనిపై ఆయన ఏమి చెబుతారన్నారు బాల్క సుమన్. కేబినెట్ లో ఉన్న దళిత మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని, దళిత జాతి రేవంత్…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటింది.. ఐదో నెలలో ఉన్నామని, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలపై క్లారిటీ లేదు.. బడ్జెట్ లేదు.. చేద్దామన్న నియత్ కూడా లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లాగానే.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పచ్చిగా మోసం చేసిందన్నారు. రేవంత్ వడ్లు ఎవరూ అమ్మవద్దు.. తాను వచ్చాక డిసెంబర్ 9వ తేదీన 500 బోనస్ ఇచ్చి కొంటామని చెప్పారన్నారు. డిసెంబర్…
అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..! ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని…
తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే.. రానున్న ఐదేండ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సామాన్య ప్రజల కోసం పని చేస్తానని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
నేడు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుంభకోణం జరుగుతుంది. రూ. 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక దీపం సీరియల్ లాగ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ కుంభకోణం జరుగుతుందని మాట్లాడారు. ఇక ‘ఆర్ఆర్’ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు.…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్దశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బంది పై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.