Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Govt Approved The Formation Of A Third Discom In Telangana

TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

Published Date :March 11, 2026 , 4:56 pm
By Burugadda Veerababu
  • రాష్ట్రంలో మూడో డిస్కమ్‌గా TGRPDCL ఏర్పాటు..
  • ఈ కొత్త సంస్థకు సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీ నియామకం..
  • రైతులకు ప్రయోజనకరంగా కొత్త డిస్కం..
TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL), టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) సంస్థలకు అదనంగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త సంస్థకు Telangana Rythu Power Distribution Company Limited (TGRPDCL) అనే పేరు పెట్టారు. దీనిని సాధారణంగా ‘రైతు డిస్కమ్’గా కూడా పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్–2013 ప్రకారం నమోదు చేయనున్నారు. హైదరాబాద్‌లోని మింట్ కంపౌండ్ ప్రాంతంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

ఈ కొత్త డిస్కమ్‌కు ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. విద్యుత్ రంగంలో ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సంస్థ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ‘రైతు డిస్కమ్’ ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను చూసుకుంటుంది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ వంటి తాగునీటి పథకాల కోసం అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ నిర్వహించనుంది. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అవసరాలకు కూడా విద్యుత్ అందించే బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది.

Also Read:National Highway: తెలంగాణ, ఏపీ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. జూన్ నాటికి అందుబాటులోకి..

ఈ సంస్థ ద్వారా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు , విద్యుత్ లైన్‌ల నిర్వహణ వంటి పనులు చేపడతారు. అదేవిధంగా విద్యుత్ వినియోగాన్ని లెక్కించడం, మీటర్ల నిర్వహణ చేయడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం వంటి బాధ్యతలను కూడా ఈ సంస్థ నిర్వర్తిస్తుంది.

కొత్త సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరిలో తిరుపతి రెడ్డి, పీ. కృష్ణారెడ్డి, వంగూరు మోహన్ రావు, ఎన్. నరసింహులు వంటి అధికారులు డైరెక్టర్లుగా నియమించబడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, భారీ సాగునీటి ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారం పెరుగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ‘రైతు డిస్కమ్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Musharraf Ali Faruqui CMD
  • Telangana electricity reforms
  • Telangana power distribution
  • Telangana Rythu DISCOM
  • Telangana third DISCOM

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions