Off The Record: కేంద్రం, తెలంగాణ మధ్య బడ్జెట్ ప్రకంపనలు రేగుతున్నాయా..? |
- కేంద్ర.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రయత్నం..
- రాష్ట్రానికి నిధులు.. మేళ్ళ గురించే ఇన్నాళ్ళు ఆలోచన..
- 18 సార్లు ఢిల్లీ పెద్దలకు తెలంగాణ నుంచి విన్నపాలు..
- స్నేహపూర్వక వాతావరణం కోరుకున్న రాష్ట్ర సర్కార్..
- బడ్జెట్‌లో మొండిచేయితో మారుతున్న తీరు..
- కేంద్రం వైఖరికి నిరసనగా అసెంబ్లీ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక… కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై స్పష్టతనిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రెండిటి మధ్య ప్రభుత్వ సంబంధాలే కొనసాగుతాయని క్లారిటీగా చెప్పేశారాయన. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న అంశంకంటే… స్నేహపూర్వకంగా ఉంటూ… రాష్ట్రానికి ఎంత మేలు చేయగలుగుతాము, ఎన్ని నిధుల్ని తీసుకురాగలుగుతామన్నదే ముఖ్యం అని చెప్పారు సీఎం. అందులో భాగంగానే 18సార్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రాలను ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లాంటి అంశాలను కేంద్రం వద్ద ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్నేహపూర్వకంగానే పనులు పూర్తి చేయాలని భావించింది రేవంత్ సర్కార్.
Read Also: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
కానీ… ప్రస్తుతం వాతావరణం అందుకు అనుకూలంగా లేదన్న టాక్ నడుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి మొండిచేయి చూపడంతో ఆ వైఖరిని నిరసిస్తూ.. తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. దీంతో ఇన్నాళ్లు ఉన్న సామరస్యం ఇక మీదట కూడా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది గతంలో అనుసరించిన వ్యూహానికి పూర్తిగా భిన్నమైనది. దీంతో నిధులు, కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో సీఎం వైఖరి మారిపోయినట్టేనా? రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. సానుకూలంగా చేయాల్సినంత వరకు ప్రయత్నం చేశాం. కుదరనప్పుడు ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టేనా అనే చర్చ తెర మీదకు వచ్చింది.
Read Also: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!
అదే సమయంలో మరో మాటా వినిపిస్తోంది. అసెంబ్లీ తీర్మానం తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసన తెలపడమేనని, దాన్ని అలా కొనసాగిస్తూనే…మళ్ళీ నిధుల కోసం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పేముందన్న వాదన సైతం ముందుకు వస్తోంది. ఓవైపు హక్కుల కోసం కొట్లాడటం, మరోవైపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడమన్న ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తే తప్పేముందని అడిగే వాళ్ళు సైతం ఉన్నారు. ముందు ముందు రేవంత్ సర్కార్ వీటిలోఏ వ్యూహాన్ని ఫాలో అవుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!