షేక్ హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్సీబీఏ వినతి..! బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఎస్సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపణలు చేశారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు…
నేటి నుంచి అమరావతిలో ముళ్ల కంపలు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ…
హెల్త్‌కేర్‌లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సీఏ హెల్త్‌కేర్ హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు…
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు…
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు.