CM Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం
- నాగార్జునసాగర్ టూరిజం పై స్పెషల్ ఫోకస్
- హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం
- హుస్సేన్ సాగర్ చుట్టూరా స్కై వాక్ వే.. వరల్డ్ క్లాస్ టూరిజం హబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీ లో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళిక లో పొందుపరచనుంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతారు. నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తారు. ఈ రహదారి కి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారం లో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్ల ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీ లో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇండ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!