షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి శిక్షించిన.. అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు.
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాది దేశం విడిచి వెళ్తున్న 2.3 లక్షల మంది హిందువులు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతి పెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. వివక్ష, అణచివేతకు గురవుతున్న హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతుంది. నేడు బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951తో పోలిస్తే 14 శాతం మేర…
We Hub: అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. రాబోయే అయిదేండ్లలో వీ హబ్‌లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా…
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీ సోమవారం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆనంద్ మహీంద్రాతో సమావేశమై రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. మహీంద్రా చైర్పర్సన్ తమ కంపెనీ పెట్టుబడి పెట్టి స్కిల్ యూనివర్సిటీకి…
CM Revanth Reddy: రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు.
Damodar Raja Narasimha: కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. సుప్రీం కోర్టు తీర్పు అమలుపై చర్చ జరిగింది. ఈ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని చెప్పుకొచ్చారు.
Vemula Prashanth Reddy: రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు..