ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు..
వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ అందించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు..…
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని వయనాడ్ బాధితుల కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి ఇవాళ (శుక్రవారం) అందజేసింది.