Kallakurichi Hooch Tragedy: కల్తీ సారా ఘటనలో 36కి చేరిన మృతుల సంఖ్య.. బాధితులకు ఎక్స్గ్రేషియా
- కల్లకురిచిలో కల్తీ సారా ఘటనలో 36కి చేరినా మృతుల సంఖ్య ..
- మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం స్టాలిన్..
- కల్లకురిచి ఘటనపై హోం సెక్రటెరీ విచారణ చేసి రాత్రికి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallakurichi Hooch Tragedy: తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 36కి చేరుకుంది. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మిథనాల్ కలిపి కల్తీ సారా విక్రయిస్తున్న వ్యక్తిని, అతడి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Sonakshi Sinha Marriage: కామూష్.. సోనాక్షి సిన్హా పెళ్లిపై స్పందించిన శతృఘ్న!
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
కాగా, ఇటీవల కల్లకురిచి పట్టణ పరిధిలోని కరుణాపురంలో అక్రమంగా విక్రయిస్తున్న కల్తీ సారాను రోజువారీ కూలీలతో కూడిన బృందం తాగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత వారిలో ఎక్కువ మంది తలతిరగడం, తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్లలో చికాకు లాంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జీప్‌మెర్)కు రెఫర్ చేయగా.. మిగతా వారిని కల్లకురిచి, సేలం, విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 75 మంది వరకు చికిత్స పొందుతుండగా మృతుల సంఖ్య 36కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు.
Read Also: Chiranjeevi : ‘పరువు’ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ బదిలీ చేయగా.. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాను సస్పెండ్ చేసి కొత్త ఎస్పీగా రజత్ చతుర్వేదిని ప్రభుత్వం నియమించింది. అలాగే జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఇక, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలాగే, కల్లకురిచిలో ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. హోం సెక్రటెరీ కల్లకురిచి ఘటనపై స్వయంగా వెళ్ళి విచారణ చేపట్టాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ రాత్రి వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!