Asaduddin Owaisi: దేశంలో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించినట్లు ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలోని రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తే ఇది భర్తీ అవుతుందని ఆయన అన్నారు.
పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి, గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ గా మారింది అని ఆయన దుయ్యబాట్టారు.
బీఆర్ఎస్ నాయకులారా.. మీరు నిజమైన తెలంగాణ వాదులైతే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే ఆ పార్టీని వీడి రండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు.
CM KCR: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1948లో ఇదే రోజున తెలంగాణ రాచరికం అంతమై ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని గుర్తు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
కేసీఆర్ మాట్లాడుతుండగా.. కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు విజిల్స్ వేయడంతో ఆయనకు చిరాకు వచ్చింది. దీంతో ఇలలు బంజేయాలి అంటూ హెచ్చరించారు. పదే పదే ఇలలు వేస్తుండటంతో విసుగు చెందిన కేసీఆర్.. విజిల్స్ వేసిన వారు మన పార్టీకి చెందిన వాళ్లు కాదు అంటూ తెలిపారు.