మహాబూబ్ నగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసిఆర్ పై బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టులపై కేసిఆర్ కు చిత్తశుద్దిలేదని… ఆర్డిఎస్ పై ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రముఖ్యమంత్రి జగన్ ల మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ఆర్డిఎస్ నుండి ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కేసిఆర్ కు సోయిలేదని.. తెలంగాణ వచ్చినాంక ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు. read also: కొత్త కాంతులతో యదాద్రి ఆలయం.. ఆర్డిఎస్ వద్ద కుర్చి…
సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటల వల్లే అధికారులు నిద్రపోయారని చురకలు అంటించారు. హరీష్ రావు మాటలు మాటలకే పరిమితమని… అమలులో మాత్రం ఉండవని మండిపడ్డారు. తెలంగాణను కాపాడేందుకు సీఎం- మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని…. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ…
మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపండి అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారు. ఆంధ్రవాళ్లు ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది మీ ముఖ్యమంత్రి గాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల సాధన.. నా కృషి వలనే అన్నది ముందు తెలుసుకోండి అన్నారు. నేను పాలమూరు కోసం చేసిన…
దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. కానీ, ఘర్షణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరైన బీజేపీ నేత ఈటల.. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వీణవంక మండలంలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఎద్దేవా చేశారు.. మేం ఎవరి జోలికి వెళ్లం.. ఈ 20ఏళ్లలో ఎప్పుడు గొడువలకు తావు ఇవ్వలేదని.. ఎప్పుడైన శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించకునేదన్నారు..…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది…
రైతులకు పంట సాయం కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుంటే.. ఇదే అదునుగా పాత బకాయిలను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు.. దీంతో.. ప్రభుత్వం సాయం చేసినా.. రైతులు పంటపెట్టుబడి పెట్టలేని పరిస్థితి.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు.. ఇక, సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన…
కరోనా కష్టసమయంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం… రైతులకు పంటసాయంగా రైతు బంధు పథకం కింద ఇచ్చే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు ప్రకటించింది కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. ఇవాళ ఒకేరోజు 2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07 కోట్లు జమ అయ్యాయని.. ఇప్పటి వరకు మొత్తం 133.27…
సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈనెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రిలో పర్యటించబోతున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామంలో ఇవాళ పర్యటించనున్నారు. read also : కేసీఆర్‌వి కొత్త అబద్ధాలు… తుగ్లక్ వాగ్దానాలు : రాములమ్మ సెటైర్ ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ గ్రామ సర్పంచ్‌కు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ…