తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి 27 జూన్ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు…
అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శాంతి భూషణ్ అనే అడ్వాకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావు. అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 86లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసింది. చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే కృషి చేయాలి. ప్రశ్నిస్తే పత్రికలను అణిచివేస్తూ, జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తుంది…
రైతులకు పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.. ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రెండు రాష్ట్రాల నీటి పంపకాల విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా చూస్తానని చెప్పిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్… ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబిని ఆదేశించారు కేంద్ర మంత్రి. ప్రస్తుత…
పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్…
కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమేనని… ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..?అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని.. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు..నిధులు కోసమేనని… కృష్ణ, గోదావరి నీళ్ళు వాడుకోవాలి అనే ఉద్యమాలు చేశామని తెలిపారు. పోతిరెడ్డి పాడు పాపం… కెసిఆర్ దేనని అని మండిపడ్డారు. Ntr ప్రారంభించినప్పుడు కెసిఆర్ మంత్రి అని… అప్పుడు కెసిఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. రెండు నదులపై కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదని… కృష్ణా నదిపై సంగమేశ్వర ప్రాజెక్టు ap కడుతుందన్నారు. read more…
శక్తి వంతమైన భారతదేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు మోడీ. స్వంతంగా మెజారిటీ ఉన్నా అందరినీ కలుపుకుని పోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల పాలు చేసారు కేసీఆర్. బీజేపీకి భయపడి గడీల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్…
ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ ని పరామర్శించిన తర్వాత మీడియా బండి సంజయ్ మాట్లాడుతూ… బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస ముఖ్యమంత్రి డైరెక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గుండాల దాడులు చేస్తున్నరు అని మండిపడ్డారు. కేసీఆర్ పై దాడులు చేసే రోజు వస్తుంది… కేసీఆర్ నీ పతనం స్టార్ట్ అయింది. ప్రశ్నిస్తే దాడులు.. చేస్తారా అని అన్నారు. మంచి చేయాలని చెప్తే…
కరీంనగర్ జిల్లా ఇళ్లంతకుంట మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మా నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధులు నాకు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం ఉంది. కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తల్లి తండ్రి విడిపోయినప్పుడు పిల్లలను పంచుకునే సమయంలో తల్లిదండ్రులు పడే వేదన నాది మా ప్రజా ప్రతినిధులది. మమ్మల్ని విడగొట్టి పాపం మూటగట్టుకున్నారు. కేసీఆర్ దుర్మార్గాలకు గొరి కట్టే బాధ్యత హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలపై ఉంది. నా మీద కేసీఆర్ దుర్మార్గంగా…