తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు నాటడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. చెట్లు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతను కూడా సీరియస్‌గా తీసుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు విడతలుగా హరితహారం నిర్వహించగా… ఏడో విడతకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం… ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలు… నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 2015లో ప్రారంభమైంది హరితహారం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241గా…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. మొన్న జరిగిన అఖిల పక్ష సమావేశానికి తనకు ఇష్టమైన వాళ్ళనే పిలిచారని.. కెసిఆర్ దళిత ద్రోహి అని నిప్పులు చెరిగారు. రోహిత్ హత్య జరిగితే కనీసం సానుభూతి ప్రకటించలేని దౌర్భాగ్య స్థితి లో టీఆర్‌ఎస్ పార్టీ ఉందని మండిపడ్డారు. మూడు ఎకరాలు మానేసి… నియోజకవర్గంలో 100 మందికి 10 లక్షలు ఇస్తానని కొత్త నాటకం మొదలు పెట్టాడని.. ప్రకటనకే పాలాభిషేకం చేస్తున్నారని ఎద్దేవా చేశారు…
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అవార్డు సొంతం చేసుకున్నాడు.. గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇనిషియేటివ్ చేసినందుకుగానూ హిమాన్షును ‘డయానా’ అవార్డు వరించింది… ఈ సందర్భంగా తనకు గైడ్‌గా ఉన్న తన తాత సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు హిమాన్షు.. కాగా, ‘శోమ’ పేరుతో రూపొందించిన ఒక వీడియోలో.. హిమాన్షు.. తన ఉద్దేశాలను వివరించారు. దానిలో.. అతను ఆహార ఉత్పత్తులలో కల్తీ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.. అంతేకాదు.. కల్తీ…
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై సక్రమమేనని…తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు…రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని… దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే కేసీఆర్ ను దళితులు విశ్వసిస్తారన్న ఎ.చంద్రశేఖర్… రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ళ తర్వాత సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తురావటం సంతోషకరమని… దళితులు అండగా ఉండబట్టే ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళగలిగారని తెలిపారు. ఉద్యమంలో దళితులు తిండికి లేక ఇబ్బంది పడితే.. కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉపవాసం…
బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి సొంతపార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బ్రతికించానని.. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు…
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఆయన ఆరోగ్యం కుదటపడింది. హాస్పిటల్ లో ఉన్న.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారు. ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని తెలిపారు. పంజాగుట్టలో అంబేడ్కర్…
హైదరాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విషయాలను పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయని, ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో నవోదయ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ…
20 ఏళ్ళ నుండి రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నం. రాష్ట్రం ఏర్పడితే దళితులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకున్నారో అవి జరగడం లేదు. ఉద్యమంలో చెప్పనవి కూడా చేస్తునమ్ అంటున్నారు కేసిఆర్.. కానీ చెప్పనవి ఎందుకు చేయడం లేదు అన్నారు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్. ఉద్యమం లో పాల్గొన్న అందర్నీ ఏకం చేయడానికి సమావేశం అయ్యాం. కేసీఆర్ కి బుద్ది చెప్పాలి.. అందుకే ఎన్నికలు వస్తాయని తెల్సిన వెంటనే సమావేశం అవుతున్నం. 7 సంవత్సరాల గడుస్తున్నా రాష్ట్రంలో…
తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికది గా సిద్ధం చేసుకోవాలి అని అన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి…