తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై సక్రమమేనని…తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు…రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని… దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.
read also : కాంగ్రెస్ గరక లాంటిది..ఎండకు ఎండినా…చినుకు పడితే చిగురిస్తుంది : రేవంత్
తెలంగాణ మంత్రుల విజ్ఞతకే ఇది వదిలేస్తున్నామని..తమ నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాము మాట్లాడగలమని హెచ్చరించారు. సీఎం జగన్ ఓపిక తో సమస్యను పరిష్కరించుకుందాం అన్నారని…పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసామని.. తమ హక్కుగా రావాల్సిన నీటి వాటాను వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. అక్రమంగా ఏ ప్రాజెక్టులు కట్టడం లేదని.. పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా అక్రమంగా కట్టినవేనని తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.