సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…
టీఆర్ఎస్ 60 లక్షల మంది కార్యకర్తలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది అని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ కార్యకర్తల సంక్షేమ కోసం బీమా కల్పించారు. ఇందుకోసం18.37 కోట్ల రూపాయల బీమా ప్రీమియం చెల్లించారు. అన్ని రాష్ట్రాల తరవాత ఆఖరులో ఏర్పడ్డ మన తెలంగాణ అతి తక్కువ కాలం ఏడేళ్ల లోనే దేశం గర్వించే అభివృద్ధి చెందింది. 70 ఏళ్లలో సాధ్యం కాని మిషన్ భగీరథను…
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు.…
దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో అమలు చేశారు.. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.. ఇక, మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అంటే.. నాలుగో నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం…
కోకాపేట భూములపై సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని,.. ఈ కుంభకోణంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ సర్కార్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. కుంభకోణాల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని… కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపించారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని… ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి…
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఘనతలను సాధిస్తూ ముందుకెళుతుంది. రోజురోజుకు పురోగతి సాధిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తాజాగా మరో ఘనతను తెలంగాణ తన ఖాతాలో వేసుకుంది. ఐటీరంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీలో తెలంగాణ అమలు చేస్తున్న విధానాలు ఆదర్శంగా ఉన్నాయంటూ పార్లమెంటరీ ఐటీ…
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా… సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని అన్నారు. ఇక అటు రేవంత్ రెడ్డి కూడా ప్రజాకవి కి కాళోజీ నారాయణరావ్ కు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం కాళోజీ సిద్ధాంతాలను అమలు చేయాలని.. కాళోజీ ఆశయాలను…
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరావో అన్నట్లుగా మారింది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నడుస్తోందని భావించినా అనుహ్యంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం సెకండ్ ప్లేస్ కోసమే పోటీ పడుతుండగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హూజురాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలు పొలికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రస్తుతం…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…
హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్‌లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై…