జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి లో భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం గోడ కూలి.. ఐదుగురు మృతి చెందారు. అయితే.. కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి… మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూన్నట్లు చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.