టీఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి అనూహ్యంగా పదవులు దక్కించుకుంటున్నారు బండ ప్రకాశ్. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. మరో కొత్త పదవి వరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఈక్వేషన్లు మారుతున్నట్టు చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకలా? ఏంటా సమీకరణాలు? బండ ప్రకాశ్‌కు మరో పదవి ఇస్తారని ప్రచారం..! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీఆర్ఎస్‌లో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలకు మరోదఫా…
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది. అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ…
కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని… మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందని… భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు. రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందని…. బడా పారిశ్రామిక…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు ప్రజల్లో ఇటు పార్టీలో… అసంతృప్తి రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే… కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. అయితే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రగతి భవన్ లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 12 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈ…
రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారు. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని అన్నారు. మోడీ ఎన్ని…
రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు. ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి.…
తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటలో వచ్చే ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. అయితే రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నాయని, రైతులు తొందరపడి ఆగమాగమై పంట కోయవద్దని సూచించారు. కోతలు అయిన వాళ్లు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకురావాలని సూచించారు. Read Also: సీఎం కేసీఆర్ డిమాండ్..…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మీడియాతో మాట్లాడనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు వరి కొనుగోళ్ల అంశంపైనా కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ ప్రెస్‌మీట్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులతో కేసీఆర్ ఇప్పటికే…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా…