స్థానిక ప్రజా ప్రతినిధులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ….నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్టు సమాచారం. గౌరవ వేతనాల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాగా ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం…
టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి? రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు? అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు.…
తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు. ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని… తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ…
రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం నాడు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మహాధర్నా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర సబ్జెక్ట్ లేదని ఆయన ఆరోపించారు. ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని… అందుకే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు అంటూ ఏదేదో చేస్తున్నాడని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. Read Also: అందుకే…
వినయం, విధేయత, స్వామిభక్తి.. ఇవన్నీ వుంటే ఏదైనా సాధించవచ్చు. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరిలోకి అన్నిరకాల రుచులు వచ్చిపడతాయని మరోసారి నిరూపణ అయింది. పెద్దల సభ అంటే కొందరికి మక్కువ. రాజకీయాల్లో జనంలో తిరగకుండా.. దండాలు పెట్టకుండా హాయిగా అయినవారి ఆశీస్సులు వుంటే హాయిగా పెద్దల సభలో దర్జాగా కాలు పెట్టేయవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసిన పారుపాటి వెంకట్రామిరెడ్డి గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పదవికి…
కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి…
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఛాన్స్ ఎవరికి దక్కనుంది..? అధికారపార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? గవర్నర్ కోటాలో ఆయన వస్తే .. అధిష్ఠానం అటు మొగ్గు చూపుతుందా? కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఆధారంగానే ఛైర్మన్ ఎంపిక ఉంటుందా? ముగ్గురు చుట్టూ మండలి ఛైర్మన్ పీఠంపై చర్చ..! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. శాసనమండలి ఛైర్మన్ ఎవరు అనే దానిపై అధికారపార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మరోసారి…
భారత రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుంది.. బీజేపీని వదలం.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలట అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలి.. దేశంలో జెండా ఎగరాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం లేపాల్సిందేనన్నారు. యాసంగిలో…
తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఇవాళ ఇందిరా పార్క్ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……