సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్‌లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించింది అని అన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని తెలిపారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడు. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్న ఆయన.. కేసీఆర్ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని జోస్యం చెప్పారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల… కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు… కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారంటూ…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా, కరీంనగర్ మాజీ మేయర్, 51 డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు… ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు రవిందర్ సింగ్… టీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో ఆరోపించారు మాజీ మేయర్.. కాగా, స్థానిక…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు..…
ఆ జిల్లాల నుండి ఒకరు ఇద్దరు కాదు.. ఎనిమిదిమంది ఎమ్మెల్సీలు…మండలిలో వరంగల్లు జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత దక్కిందా?తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్లుకు కెసీఆర్ న్యాయం చేస్తున్నారా?శాసన మండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపించనుందా? మండలిలో తెలంగాణలో ఏ ఇతర జిల్లాకు రానంత ప్రాధాన్యం వరంగల్ జిల్లాకు వచ్చిందా..?అవుననే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎంఎల్సీ పదవుల్లో సింహభాగం ఓరుగల్లుకే దక్కాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్న జిల్లాగా వరంగల్ జిల్లాకు గుర్తింపొచ్చింది.…
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు చేసిన టెస్టుల్లో కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోవిడ్ సోకినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పోచారం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల తనతో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇటీవల పోచారం శ్రీనివాస్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇవాళ చేసిన కరోనా పరీక్షల్లో… పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా సోకింది. కరోనా మహమ్మారి సోకడంతో… ఆస్పత్రిలో చేరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ నమోదు అయిందని… ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య…
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా…