కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత సహా టీఆర్‌ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్‌ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ…
నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు,…
ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ…
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేయడంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. కేబినెట్‌లో చోటు కల్పించడానికే ఆయన్ను మండలికి తీసుకొచ్చారని సమాచారం. బండ ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవడం..ఇంకొందరిని డ్రాప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్‌లోకి తీసుకొనేందుకే బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ? గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. తొలి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ హంతకుడంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండంటూ ఫైర్ అయ్యారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదంటూ ఓ రేంజ్ లో సీఎం…
నిన్న టీఆర్‌ఎస్ భవన్ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్. 40 లక్షల…
రేపు ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందిరాపార్క్ ధర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు. రాష్ర్టానికి ఒక విధానం ఉండకూడదా..? కేంద్రంపై ఒత్తిడి పెంచేం దుకు ఇందిరా…
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీని వెంటాడుతాం… వేటాడుతామని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. తాము ఉద్యమ కారులమని…కేంద్రంపై కొట్లాడటంపై కొత్తేమీ కాదన్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని… ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రశ్నిస్తే…కేంద్రం ఉలుకు లేదు…పలుకు లేకుండా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు…