సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం సమాచోనలు చేస్తోంది. ఈ క్రమంలో లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పరిమితి లేకుండా దళితబంధు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ…
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు సర్వీసును రెన్యువల్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 31 మే 2022 వరకు 1,217 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్…
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రధానితో వీసీ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జునరావు…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 70 రోజుల్లోనే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…ఇవి ఆత్మహత్యలు కావు, కేసీఆర్ చేసిన హత్యలని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా దిగజారుస్తున్నాడని…ఆయన కు రైతుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అన్నాక ముందుచూపు ఉండాలని…. ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతులు బతికేవారని… పరిపాలన చేతకాక…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోలేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని కోరిన ఆయన.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దు అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లిన జగ్గారెడ్డి.. కనీస మార్కులు వేసి అందరినీ పాస్ చేయాలని కోరారు.. ఈ విషయంపై విద్యార్థులు…
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నాడు నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Read Also: గ్రేట్ టాలెంట్.. ఖమ్మంతో పెట్టుకుంటే కుమ్ముడే..!! సూర్యాపేట జిల్లా…
రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతులకు వైఎస్ ఆర్ ఎంతో చేశారని… పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసినట్టు? అని నిలదీశారు. రైతు…
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం అన్నారు మంత్రి పీయూష్ గోయల్. 20 లక్షల…